కాఫీవిత్ ఆర్.రమాదేవి పొయెట్రీ..660

*కాఫీవిత్ ఆర్.రమాదేవి పొయెట్రీ..660

రమాదేవిగారు ప్రతీ సందర్భాన్ని తనదైన శైలిలో
కవిత్వం చేయాలని ప్రయత్నిస్తారు‌.ఇది కూడా..
అలాంటి ఓ ప్రయత్నమే.ఇందులో ఓగమ్మత్తవుంది.
అదేదో తెలుసుకునే ముందు ఈ కవితను మీరూ
ఓ సారి చదవండి..!!

*నిశ్శబ్దంగా నింపాదిగా  నా చెంత చేరింది
సువాసనలు వెదజల్లుతూ "నీలోఫర్ టీ '
ఎంత బాగుందో
ఇక కట్టుబడిపోయాననుకున్నా ...
అదేమిటో
రెండు క్షణాలు దాటకుండానే
వదలని మత్తుల
మరువని కలల
బ్లాక్ కాఫీ రుచి గుర్తొచ్చింది
ఓయ్
బ్లాక్ కాఫీ
నీలా వదలని నీడనేనోయ్
నీ మొండి పట్టు
దాని సొంతం ఎప్పుడయ్యిందో మరి”!!
              *ఆర్ రమాదేవి.!!

ఎవరికైనా…ఓ రుచి,అభిరుచి వుంటాయి.ఎవరి
రుచి,అభిరుచి వారిదే..అలాగే రమాదేవిగారికి..
నీలోఫర్ టీ(చాయ్) అంటే ఎంతో ఇష్టం..కారణం
దాని రుచి,మఖ్యంగా పరిమళం.‌అలాగని నీలోఫర్
టీ కి మాత్రమే పరిమితం కాదండోయ్.! టీ తాగాక
అదేంటో బ్లాక్ కాఫీ గుర్తొస్తుంది‌..అది తనను నీడలా
వీడని అతగాడి మొండిపట్టుదలలాంటిది మరి…
అందుకే బ్లాక్ కాఫీ అన్నా అంత ఇష్టం రమాదేవికి.

ఇంతవరకు మామూలుభావనే కానీ, ఇది చదివాక నాకనిపించిన గమ్మత్తు భావననుఇప్పుడుచెబుతా.
ఇందులో నీలోఫర్ టీ‌‌.‌..అంటే నేను.‌మా ఇంటి దగ్గరే నీలోఫర్ రెస్టారెంట్.‌‌.నేనప్పుడప్పుడు నీలో
ఫర్ చాయ్ రుచి ప్రస్తావన తెస్తుంటాను.అంతెందుకు నీలోఫర్ ఓనర్ బాబురావు గారి గురించి కూడా
కథనం రాశాను.‌అలా నన్ను నీలోఫర్ టీలో చూశారేమో రమాదేవిగారు.ఎఫ్బీలో ఉదయాన్నే  నా కాఫీ
విత్ శీర్షికకు ఆమె రెగ్యులర్ పాఠకురాలు..ఓ రోజు పోస్టింగ్ కాస్తంత లేటైతే..ఊర్లో లేరా? ఏడైనా… పోస్టింగ్ లేకపోతే …అంటూ మెసెంజర్లో మెసేజ్పెట్టేస్తారు.అంతగా ఆమె ఆ కాలాన్ని ఇష్టపడతారు.
నీలోఫర్ టీ మాదిరిగా‌…!

ఇక బ్లాక్ టీ గురించి చెబుతా!
గీతా వెల్లంకి గారి కి బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం.
బ్లాక్ కాఫీ తప్ప ఆమె ఇంకేదీ తాగరు.అప్పుడప్పుడు కోల్డ్ కాఫీ కూడా తాగుతారు.అదికూడా బ్లాక్
కోల్డ్ కాఫీ మాత్రమే..అది ఆమె రుచి‌‌అభిరుచి…గీతమ్మ ప్రస్తావన ఇక్కడెందుకనుకుంటున్నారుకదూ
అక్కడికేవస్తా!గీతావెల్లంకి,రమాదేవిమంచిదోస్తులు.
బ్లాక్ కాఫీ గీతమ్మ బలహీనత‌‌..ఎక్కడికివెళ్ళినా…ముందుగా అడిగేది బ్లాక్ కాఫీకోసమే.దానాకోసం.‌
మొండిపట్టు పడతుంది..ఈ సంగతి రమాదేవికి బాగా తెలుసు.‌అలా గీతమ్మను బ్లాక్ కాఫీలో చూసుకొని,ఈ కవితలో “యాద్ “(గుర్తు)చేసుకున్నారు రమాదేవి..‌

ఈ గమ్మత్తు భావన నాదే సుమా.‌మరి రమాదేవి
గారు ఇలా ఊహించి రాశారా? లేదా? వారే..…
చెప్పాలి..ఈ నీలోఫర్ టీ, బ్లాక్ కాఫీ గురించిన…
స్వారస్యం‌‌!!

*ఎ.రజాహుస్సేన్…!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!